ETV Bharat / state

ఆ లిస్టులో నా పేరు లేకపోవడం ఆశ్చర్యం: ఎంపీ రఘురామ - రఘురామ తాజా వార్తలు

ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం పర్యటన ప్రొటోకాల్ లిస్టులో తన పేరు లేదని తెలిసి ఆశ్చర్యపోయానని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తనను అడ్డుకుంటారని తెలిసే ప్రొటోకాల్‌ వంటి అంశాలపై ముందే లేఖ రాశానని అయినా.. తన పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థంకావట్లేదని అసహనం వ్యక్తం చేశారు.

RAGHURAMA
RAGHURAMA
author img

By

Published : Jul 4, 2022, 4:22 PM IST

ఆశ్చర్యం.. అలా ఎలా జరిగిందో అర్థంకావట్లేదు: ఎంపీ రఘురామ

ప్రధాని ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం సభకు తనను రానీయకుండా అడ్డుకున్నారని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకుంటారని తెలిసే ప్రొటోకాల్‌ వంటి అంశాలపై ముందే లేఖ రాశానని అయినా.. తన పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థంకావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోతే ఏమనాలని ప్రశ్నించారు.

"ప్రధాని సభకు రాకుండా నన్ను అడ్డుకున్నారు. విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయి. పర్యటన లిస్టులో నా పేరు లేదని తెలిసి ఆశ్చర్యపోయా. ఇవన్నీ తెలిసే ప్రొటోకాల్‌ వంటి అంశాలపై ముందే లేఖ రాశా. నా పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థంకావట్లేదు. కోర్టులు ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోతే ఏమనాలి ?." - రఘురామ కృష్ణరాజు, వైకాపా ఎంపీ

అల్లూరికి మోదీ ఘన నివాళి: ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భీమవరంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సభా ప్రాంగణం నుంచే వర్చువల్‌ ద్వారా విగ్రహావిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోదీ.. మన్యం వీరుడికి ఘనంగా నివాళులర్పించారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.