ETV Bharat / state

MP Nama Nageswara Rao Speech In Lok Sabha : 'కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వలేదు.. నిరూపిస్తే రాజీనామాలకు సిద్ధం' - Motion of No Confidence in Central Govt

MP Nama Nageswara Rao Speech In Lok Sabha : కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని బీఆర్​ఎస్​ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపారు. బీజేపీ ఎంపీలంతా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్​సభలో ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడారు.

MP Nama Nageswara Rao
MP Nama Nageswara Rao Speech In Lok Sabha
author img

By

Published : Aug 10, 2023, 3:49 PM IST

Updated : Aug 10, 2023, 5:40 PM IST

MP Nama Nageswara Rao Speech In Lok Sabha : కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని.. కేంద్రం నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే తమ పార్టీ​ ఎంపీలంతా రాజీనామా చేయడానికి సిద్ధమని బీఆర్​ఎస్​ లోక్​సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు(Nama Nageswara Rao) సవాల్​ విసిరారు. ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎంపీ మాట్లాడారు. బీజేపీ ఎంపీలంతా అబద్ధాలు చెపుతున్నారని మండిపడ్డారు. ఆ కూటమి ఎంపీలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఎంపీ నిషికాంత్​ దూబేపై బీఆర్​ఎస్​ ఎంపీలు ప్రివిలేజ్​ నోటీసులు ఇచ్చారు.

మణిపుర్​ హింసాత్మక ఘటన(Manipur Clash)పై విపక్షాలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ మేరకు లోక్​సభ(Lok Sabha)లో అధికార పక్షాలు, విపక్షాల మధ్య తీవ్ర దుమారమే రేగుతోంది. బీఆర్​ఎస్​(BRS) తరఫున ఆ పార్టీ లోక్​సభాపక్షనేత నామ నాగేశ్వరరావు ఘాటుగానే అధికార పక్షానికి చురకలు అంటిస్తున్నారు. తెలంగాణలోని సమస్యలను లేవనెత్తుతూ.. అవిశ్వాసంపై మాట్లాడారు. మణిపుర్​ హింసాత్మక ఘటన దేశానికే సిగ్గుచేటని ఎంపీ పేర్కొన్నారు. విదేశాల్లోనూ భారత్​ పరువు మంటల్లో కలిసిందని దుయ్యబట్టారు.

Telangana Debts in 2022-23 : పెరుగుతున్న రుణభారం.. 2022-23లో రూ.20 వేల కోట్ల మార్కు దాటిన అప్పు

Nama Nageswara Rao Roaring Speech on Manipur Issue : ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్​కు అభిలపక్షాన్ని తీసుకెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని నామ నాగేశ్వరరావు డిమాండ్​ చేశారు. అక్కడ శాంతిని పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని.. అందరికీ సమాన న్యాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

మణిపుర్​లో ఆగని అల్లరిమూకల ఆగడాలు.. 15 ఇళ్లకు నిప్పు.. ఓ వ్యక్తిపై కాల్పులు..

ఇంకా విభజన హామీలు నెరవేర్చలేదు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నా.. విభజన చట్టంలోని ఇంకా కొన్ని హామీలను కేంద్రం నెరవేర్చలేదని గుర్తు చేశారు. కాజీపేటకు రైల్వేకోచ్​ ఫ్యాక్టరీని మంజూరు చేయాలని.. ఆ విషయం విభజన చట్టంలో కూడా ఉందని ఎన్నిసార్లు అడిగిన ఉలుకుపలుకు లేదని దుయ్యబట్టారు. ఆ కోచ్​ ఫ్యాక్టరీలను మహారాష్ట్ర, గుజరాత్​కు తరలించి.. తెలంగాణకు కోచ్​ రిపేర్​ ఫ్యాక్టరీని ఇచ్చారని ఎద్దేవా చేశారు.

Nama Nageswara Rao Fires On Central Govt : తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్​ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో అడుగుతున్నామన్నారు. రాష్ట్రానికి మెడికల్​ కాలేజీలు, నవోదయ విద్యాసంస్థలు ఇవ్వట్లేదని నామ నాగేశ్వరరావు విమర్శలు చేశారు. వీటికోసం ఎన్నిసార్లు లేఖలు రాసిన స్పందన లేదన్నారు. గత యూపీఏ ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన ఐటీఐఆర్​ ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసిందని గుర్తు చేశారు. అసలు రాష్ట్రంపై మోదీ ప్రభుత్వం ఎందుకంత వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ కూడా దేశంలో భాగమే కదా అని ఎంపీ నామ పేర్కొన్నారు.

BRS MP Nama Nageswararao Fires on Central Government : 'కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది'

Nama Comments: 'రాష్ట్రాన్ని చాలా విషయాల్లో కేంద్రం అన్యాయం చేస్తోంది..'

Last Updated : Aug 10, 2023, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.