కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలను ఎత్తిచూపిస్తూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రెండు పేజీల లేఖ రాశారు. ఈ నెల ఆరో తేదీన కాళేశ్వరంపై రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జీవోలు అమలు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎత్తిపోతల పథకాలకు చెందిన నీటిని ఎత్తిపోసే సామర్థ్యాన్ని రోజుకు రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలకు పెంచినట్లు ఆ లేఖలో ప్రస్తావించారు. దీంతో 40వేల కోట్ల అదనపు భారం ప్రజలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ టెండర్ల ద్వారా పనులు అప్పగించాల్సి ఉండగా... నామినేషన్ పద్ధతిన గుత్తేదారుడికి పనులు అప్పగించారని ఆరోపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ జీవోల్లో పేర్కొన్న పనులు అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలపై విచారణ జరిపించి... భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రధానిని ఎంపీ కోమటిరెడ్డి కోరారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ ప్రధానికి కోమటిరెడ్డి లేఖ - Komati reddy
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలను ఎత్తిచూపిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రెండు పేజీల లేఖ రాశారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు.