మాతృభాషపై పట్టు సాధించకుండా ఏ భాషలోనూ రాణించలేమని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ ఎన్.గోపి పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం పురష్కరించుకుని హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన అష్టావధాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
పిల్లలు ప్రాథమిక, మాధ్యమిక దశలో మాతృభాషను నేర్చుకోవడం వల్ల సృజనాత్మకత పెంపొందుతుందని స్పష్టం చేశారు. ఆంగ్ల భాషను మన చెలికత్తెగా తీసుకెళ్లాలిగాని నెత్తిన ఎక్కించుకోవద్దని సూచించారు. డాక్టర్ కావూరి శ్రీనివాస్, గొంటుముక్కల గోవింద్, కొత్తోజు జనార్దనాచారి, బీవీవీ సత్యనారాయణకు మతృభాష పురస్కారాలను ప్రదానం చేశారు.