ETV Bharat / state

Delay in Southwest Monsoon : ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు.. జూన్​ 15 నాటికి తెలంగాణకు - Delay in Monsoon in 2023

Monsoon to hit Telangana on June 15th : జూన్​ మొదటి వారమైనా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించలేదు. అండమాన్‌ సమీపంలోనే ఆగిపోయాయి. మరో మూడు రోజుల్లో కేరళ తీరానికి చేరుకోనున్నాయి. 15వ తేదీ నాటికి తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. నైరుతి రుతుపవనాల ఆలస్యానికి కారణం ఎల్‌నినో ప్రభావమేనని వాతావరణ శాఖ తెలిపింది.

Monsoon
Monsoon
author img

By

Published : Jun 6, 2023, 12:06 PM IST

Delay in Monsoon in 2023 : వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. అవి సముద్రపైన నిలకడగా ఉంటున్నాయి. ఈ కారణంగా అవి కేరళ తీరాన్ని మరో మూడు రోజుల తర్వాతే తాకే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి తెలంగాణలో జూన్​ 15వ తేది వరకు వర్షాలు పడకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్​ నికోబార్​ దీవులను దాడి ప్రస్తుతం బంగాళఖాతంలో కొంత మేరకు ముందుకు వచ్చిన రుతుపవనాలు అక్కడే ఆగిపోయాయి. అరేబియా సముద్రంలో లక్ష దీవులను తాకిన అవి ముందుకు జరగడంలేదు. గత సంవత్సరం జూన్​ 1వ తేదీన కేరళాను తాకి వర్షాలు మొదలైనా ఈ సంవత్సరం ఆ తేదీకి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు.

Monsoon to hit Telangana on June 15th : రుతుపవనాల ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సంవత్సరం వానాకాలంలో వర్షపాతం అయిదు శాతం వరకూ తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల మందగమనానికి ఎల్‌నినో ప్రభావం కొంత కారణం ఉండొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ‘పసిఫిక్‌ మహా సముద్రంలోని పెరు, ఈక్వెడార్‌ల సముద్ర జలాలు సాధారణం కన్నా ఏడు డిగ్రీలు అదనంగా వేడెక్కి వీచే గాలుల్లో ఒత్తిడి అత్యధికమైంది. ఆ ప్రభావం భారత్​ సమీప సముద్ర జలాలపైనా పడుతోంది.

Delay in Monsoon in 2023: ఎల్‌నీనో ప్రభావం తీవ్రంగా ఉంటే కరవు ఏర్పడే అవకాశాలున్నాయి. ఉదాహరణకు దీని ప్రభావంతో ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్‌, భారత్‌ వంటి దేశాల్లో 1997-98, 2003, 2015 సంవత్సరాల్లో వర్షాలులేక కరవు పరిస్థితులు ఏర్పడి రైతులు పంటలు పండించే స్థితిలేక తీవ్రంగా నష్టపోయారు. అదే సమయంలో కుంభవృష్టి కురిసి పెరూ, అమెరికా వంటి దేశాల్లో అత్యధిక వర్షాలు వచ్చి వరదలు వచ్చాయి. ప్రతి రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి ఎల్‌నినో ప్రభావం పడటం ఆనవాయితీగా మారిందంటూ’’ నిపుణులు పేర్కొంటున్నారు.

గత మూడు సంవత్సరాలుగా భారత దేశంలోకి రుతుపవనాలు నిర్ణీత తేదీల్లో జూన్‌ 1వ వారంలోనే దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈసారి ప్రవేశానికి ఆలస్యమవుతున్నాయి. సాధారణంగా జూన్‌ మొదటివారంలో రుతుపవనాల విస్తరణతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడాలి. ఈ సంవత్సరం రెండు రాష్ట్రాల్లో ఎండలు ప్రజల్ని ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ పరిస్థితి చెప్పలేకుండా పోయింది. ఇలా జూన్‌ మొదటి వారం చివరిలో వడగాలులు వీయడం తెలంగాణలో అత్యంత అరుదు.

Five died due to Sunstroke in TS : రాష్ట్రంలో వడదెబ్బతో అయిదుగురు మృతి

ఎండ వేడికి అన్నదాతలు దుక్కి దున్నే సాహసం చేయలేకపోతున్నారు. ఏరువాక పౌర్ణమి ఈ నెల 4నే దాటినా విత్తనాలు వేయలేనంతగా ఎండలున్నాయంటే వాతావరణ ప్రభావం వ్యవసాయంపై ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతం పలు జిల్లాల్లో అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు కురుస్తున్నాయి. అవి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్నవి కానే కాదు. అవి ఎప్పుడు ఆగిపోతాయో కూడాతెలీదు. విత్తనాలు వేస్తే మొలకెత్తక ఎండిపోయే ప్రమాదముంది’ అని శాస్తవేత్తలు హెచ్చరించారు. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఆరంభమయ్యే వరకు రైతులు విత్తనాలు వేయవద్దని సూచించారు. వేసిన ఎండకు అవి మొలకెత్తవు అని పెట్టుబడి వృథా అవుతుందని హెచ్చరించారు.

India Monsoon Rains Arrive Late : రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ నెల 9వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని తెలుపుతూ వాతావరణ శాఖ సోమవారం ప్రజలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పగటిపూట 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో వడగాలులు అధికంగా వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ ప్రాంతంపై 1,500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉందని, ఛత్తీస్‌గఢ్‌ ఉత్తర ప్రాంతం నుంచి తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున ఏర్పడిందని, వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిసే సూచనలున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.