ETV Bharat / state

పోషకాహార కార్కానా.. ఈ 'న్యూట్రీ గార్డెన్'​

అదొక ప్రయోగశాల... డంపింగ్ యార్డ్‌ని తలపించే స్థలాన్ని ఓ నందనవనంలా తీర్చిదిద్దారు. భాగ్యనగరంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ప్రాంగణలో "న్యూట్రీ గార్డెన్" పేరిట కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. అరెకరం విస్తీర్ణంలో సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేస్తున్న ఆ ఉత్పత్తులు సేవాసదన్‌కు అందిస్తూ విద్యార్థుల్లో పౌష్టిక విలువలు పెంపొందిస్తున్నారు. ఈ నమూనా విజయవంతం కావడం వల్ల అంగన్‌వాడీ కేంద్రాల్లోను న్యూట్రీ గార్డెన్‌లు నెలకొల్పి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

agriculture news, telangana news
model nutri garden, model garden
author img

By

Published : Mar 29, 2021, 4:38 PM IST

Updated : Mar 29, 2021, 4:48 PM IST

బిందు సేద్య పద్ధతిలో సాగు
బిందు సేద్య పద్ధతిలో సాగు

కరోనా ప్రభావంతో ప్రజల్లో పౌష్టికాహారంపై శ్రద్ధ పెరిగింది. రోగ నిరోధక శక్తి పెంపొందించుకోడానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఓ వినూత్నం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయం సాధించింది. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ అమీర్‌పేట్​లోని జలగం వెంగళరావునగర్‌లోని ఆ శాఖ కమిషనరేట్ ప్రాంగణంలో అద్భుతమైన క్షేత్రం ఆవిష్కరించింది. ఉద్యాన శాఖ సహకారంతో బిందు, తుంపర సేద్యం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సమగ్ర కూరగాయలు, ఆకుకూరల పెంపకం చేపట్టింది. పూర్తి సేంద్రీయ పద్ధతుల్లో టమాట, సొర, బీర, కాకర, గోరుచిక్కుడు, వంగ, బెండ, పచ్చిమిరప వంటి 8 రకాల కూరగాయలు, పాలకూర, తోటకూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా సహా పలురకాల ఆకుకూరలు సాగు చేస్తున్నారు. వాటిని అదే ప్రాంగణంలో ఉన్న సేవాసదన్‌, శిశు విహార్‌లో అనాథ పిల్లలు, వసతి గృహాలకు అందిస్తున్నారు.

చేతికొచ్చిన కాకర పంట
చేతికొచ్చిన కాకర పంట
నిగనిగలాడుతున్న వంగ
నిగనిగలాడుతున్న వంగ

వెయ్యిమందికి సరిపోయేలా..

పోషణ్‌ అభియాన్‌... జాతీయ పోషకాహార కార్యక్రమం. ప్రజల సంపూర్ణ పోషణ కోసం ప్రధాని మోదీ సూచించిన విస్తృత పథకం. చిన్నారుల్లో సరైన ఎదుగుదల లేకపోవడం, పోషకాహార లేమి, తక్కువ బరువుతో శిశువుల జననం, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ముఖ్యంగా బాలికల్లో రక్తహీనతపై ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి సారించడం లక్ష్యం. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ మోడల్ న్యూట్రీ గార్డెన్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచినట్లు ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వెల్లడించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ డి.దివ్య స్వీయ పర్యవేక్షణలో ఈ పోషక క్షేత్రంలో పండించిన కూరగాయలు, ఆకుకూరలను ఇదే ప్రాంగణంలో సేవాసదన్, దుర్గాభాయి దేశ్‌ముఖ్ విద్యాలయంలోని వెయ్యి మంది విద్యార్థినులకు వండి పెడుతున్నారు. మిగిలినవి అదే శాఖ ఉద్యోగులకు సరఫరా చేస్తున్నారు.

నోరూరిస్తున్న ఆకుకూర
నోరూరిస్తున్న ఆకుకూర
టమాటా.. దీని రుచే సెపరేటు
టమాటా.. దీని రుచే సెపరేటు

పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో..

పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో తీర్చిదిద్దిన ఈ పోషక తోటలో కూరగాయలతో పాటు మునగ, బొప్పాయి, మామిడి, నేరేడు, సపోట, సీతాఫలం, నిమ్మ లాంటి పది రకాల పండ్ల మొక్కలు కూడా వేశారు. ఈ క్షేత్ర నిర్వహణకు ఏకంగా ఉద్యాన శాఖ నుంచి సహాయ సంచాలకులు జయరాజ్‌ను డిప్యూటేషన్‌పై నియమించారు. ఆయన స్వయంగా దగ్గరుండి మరీ సాగు విధానం పర్యవేక్షిస్తున్నారు. ప్రకృతి, సహజ పద్ధతుల్లో వేపనూనెలు ఉపయోగిస్తున్నారు.

దీని ఆదర్శంతో..

ఈ ఆదర్శ పోషక తోట సందర్శన కోసం రోజూ వివిధ జిల్లాల మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓలు వస్తుంటారు. ఈ వేసవి తర్వాత అన్ని జిల్లాల్లోని జిల్లా కార్యాలయాలు, సీడీపీఓ కార్యాలయాలు, ఐసీడీఎస్ కేంద్రాల వద్ద కూడా ఈ తరహా క్షేత్రాలు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటం విశేషం.

ఇదీ చూడండి: ఓ మంచి ఆలోచన... కొందరికి ఉపాధి.. ఎందరికో ఆదర్శం.. అదెలా అంటే..!

Last Updated : Mar 29, 2021, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.