పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక కసరత్తు చేపట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా వెబ్ కాస్టింగ్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు అనేక పోలింగ్ కేంద్రాలను అనుసంధానిస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.
ఓటింగ్ ప్రక్రియను లైవ్లో ఎప్పటికప్పుడు వీక్షించి... ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే స్పందించేందుకు ఈ వెబ్ కాస్టింగ్ దోహదపడనుంది.
ఇదీ చదవండి: 'నేను కేసీఆర్ను కలవలేదు... తప్పుడు ప్రచారమన్న కోదండరాం'