ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి దీక్ష - కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరాహార దీక్

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 23వ రోజుకు చేరుకుంది. కార్మికుల సమ్మెకు మద్దతుగా పలువురు నేతలు నిరాహార దీక్షలకు దిగుతున్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హైదరాబాద్​ యూటీఎఫ్​ కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

MLC NARSIREDDY HUGER STRIKE FOR SUPPORTING TSRTC STRIKE IN HYDERABAD
author img

By

Published : Oct 27, 2019, 6:33 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్​లోని దోమలగూడ యూటీఎఫ్ కార్యాలయంలో చేస్తున్న దీక్షకు పలు రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఆర్టీసీ సంస్థ ముగిసినట్లేనని సీఎం కేసీఆర్​ ప్రకటించడం దుర్మార్గమని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు తూతూమంత్రంగానే సాగాయని ఆరోపించారు. ప్రభుత్వం కార్మిక సంఘాలతో సంపూర్ణంగా చర్చలు జరిపి సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి దీక్ష

ఇదీ చదవండిః నరకాసురుడు ఎందుకు ఓడిపోయాడు...?

Intro:ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎం ఎల్ సి రిలే నిరాహార దీక్ష చేపట్టారు

Body:ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె నేటికి 23 రోజులకు చేరుకుంది ఈ సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఇ హైదరాబాద్ లోని దోమలగూడ యూటీఎఫ్ కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టారు ఈ దీక్షా శిబిరాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులు కార్మిక సంఘాల నాయకులు ప్రతినిధులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు కాలయాపన చేస్తున్నారని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఇ రాజి రెడ్డి ఆరోపించారు కార్మికుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు కార్మిక సంఘా లకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేస్తున్న ఫలితంగానే సమ్మె 23 రోజులు విజయవంతమైందని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకుండా నెట్టివేయడం తోనే ఇతర రాజకీయ పార్టీలు తమ సమ్మెకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వాటిని ఆశ్రయించడం తప్ప అని ఆయన ప్రశ్నించారు ఇకనైనా ప్రభుత్వం సమస్యలపై స్పందించాలని ఆయన కోరారు..... ఆర్టీసీ సంస్థ ముగిసినట్లే అని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం దుర్మార్గమని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో ఆర్టీసీ సంస్థ లేదు అంటే అసలు తెలంగాణ రాష్ట్రమే లేదన వచ్చని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు తూతూమంత్రంగా సాగాయని ఈ ఘోరం ఇవ్వాలని ఆయన సూచించారు ప్రభుత్వం కార్మిక సంఘాలతో సంపూర్ణంగా చర్చలు జరిపి సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఆయన విన్నవించారు స్పందించని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.....

బైట్...... రాజిరెడ్డి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి
బైట్.... నర్సిరెడ్డి ఎం ఎం సి

Conclusion:ఆర్టీసీ కార్మికులు సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు కార్మిక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.........
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.