ETV Bharat / state

విద్యుత్​ బిల్లులపై సీఎం కేసీఆర్​కు జీవన్​రెడ్డి లేఖ - సీఎం కేసీఆర్​కు జీవన్​రెడ్డి లేఖ

రాష్ట్రంలో అధిక విద్యుత్ బిల్లులు చెల్లించడం ప్రజలకు భారంగా మారిందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు. తక్షణమే విద్యుత్ బిల్లులను టెలిస్కోపిక్‌ విధానంలోకి మార్చాలని డిమాండ్ చేశారు.

Mlc jeevan reddy letter to cm kcr on power bills
విద్యుత్​ బిల్లులపై సీఎం కేసీఆర్​కు జీవన్​రెడ్డి లేఖ
author img

By

Published : Jun 17, 2020, 3:32 PM IST

విద్యుత్ బిల్లులను టెలిస్కోపిక్‌ విధానంలోకి మార్చాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు... కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి లేఖ రాశారు. నాలుగు పేజీల లేఖ రాసిన ఆయన... టెలిస్కోపిక్‌, నాన్‌ టెలిస్కోపిక్‌ విధానాలల్లో విద్యుత్ బిల్లులు వేయడం ద్వారా ఎంత వ్యత్యాసం వస్తుందో ఉదాహరణతో వివరించారు. కరోనా విపత్కర సమయంలో నాన్‌ టెలిస్కోపిక్‌ విధానంలో అధికంగా బిల్లులు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. లాక్​డౌన్‌తో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో అధిక విద్యుత్ బిల్లులు చెల్లించడం ప్రజలకు భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే బిల్లులను టెలిస్కోపిక్‌ విధానంలోకి మార్చాలని, అదనపు ఛార్జీలు, వడ్డీ వేయకుండా వాయిదాల విధానంలో చెల్లింపునకు వినియోగదారులకు అవకాశం ఇవ్వాలని జీవన్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.