బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ప్రభుత్వం దాటవేసే ధోరణి ప్రదర్శించిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఆరున్నరేళ్ల తెరాస పాలనలో సర్కారు రెండు అంశాల్లో ప్రగతి సాధించిందని ఎద్దేవా చేశారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చడంలో కేసీఆర్ విజయం సాధించారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించి ప్రగతి సాధించారని దుయ్యబట్టారు.