ETV Bharat / state

విద్యార్థులపై దాడి అమానుషం: ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న నియామకాలను నింపకపోవడం వల్ల నిరుద్యోగ యువత ఆందోళనలో ఉందన్నారు. అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న విద్యార్థులను అరెస్ట్‌ చేయడాన్ని ఆయన ఖండించారు.

MLC Jeevan Reddy condemns the lathi charge  on students
విద్యార్థులపై దాడి అమానుషం: ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి
author img

By

Published : Mar 11, 2020, 9:42 PM IST

విద్యారంగంలో సమస్యల పరిష్కారం కోరుతూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. ప్రభుత్వం నిరంకుశత్వం విడనాడాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. విద్యారంగంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు యత్నించిన విద్యార్థులపై లాఠీఛార్జ్​ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పాటుతో విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావించిన నిరుద్యోగ యువతకు నిరాశ ఎదురవుతోందని పేర్కొన్నారు. కొత్త ఉద్యోగాలు రాకపోగా... ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాయితీలు పొందుతున్న ఐటీ పరిశ్రమలు స్థానిక నిరుద్యోగ యువతకు ఏమైనా రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయా అని ఆయన ప్రశ్నించారు.

విద్యార్థులపై దాడి అమానుషం: ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.