మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాతావరణ సమతుల్యం కోసం అందరూ కృషి చేయాలన్నారు. జాతీయ సైన్స్ దివోత్సవం సందర్భంగా హైదరాబాద్ వివేకానగర్‌లోని త్యాగరాయ గానసభ మినీహాల్లో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఐ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సన్మానించారు.
వాతావరణ మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు శాస్త్రవేత్తలను తయారు చేయాలని ఎమ్మెల్సీ సూచించారు. ప్రస్తుతం కాలుష్యం పెరిగిపోయిందని, మంచి నీటిని కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో ప్రజలు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని తిరిగే పరిస్థితి రాకుండా వాతావరణ సమతుల్యత కోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
అభాగ్యులను తీర్చిదిద్దుతున్నాం :
సమాజంలో అభాగ్యులను గుర్తించి ఉత్తములుగా తీర్చడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఐ పౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్ తెలిపారు. ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడంతో పాటు సమాజానికి సేవలందించే ఉపాధ్యాయులకు సన్మానం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.