ఏపీ విశాఖ మన్యంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మారుమూల గ్రామాల్లో గుర్రంపై ప్రయాణించారు. గూడెం కొత్తవీధి మండలం, సంకాడ పంచాయతీలను పరిశీలించి లాక్డౌన్ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ పంచాయతీల్లో మారుమూల గ్రామాలకు రహదారి సదుపాయం లేకపోవడం వల్ల డింగిరాయి నుంచి గుర్రంపై రెండు కిలోమీటర్లు పర్యటించి గిరిజనులను పరామర్శించారు. 40 రోజులుగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోయారు. ఎమ్మల్యే వంటచేసి వారికి వడ్డించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే గుర్రం ఎక్కారు.. ఎందుకో తెలుసా? - mla bhagyalaxmi latest news update
ఏపీ విశాఖ మన్యంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గుర్రంపై పర్యటించారు. మారుమూల గ్రామాలకు రహదారి సదుపాయం లేకపోవడం, అక్కడి ప్రజలు లాక్డౌన్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునేందుకు గుర్రంపై ప్రయాణించి గిరిజన గ్రామాలకు చేరుకున్నారు.