ETV Bharat / state

హైదరాబాద్​ అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యం: సీతక్క

author img

By

Published : Nov 29, 2020, 10:45 AM IST

రంగారెడ్డి జిల్లా బీఎన్‌ రెడ్డి నగర్‌లో ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని సీతక్క ప్రజలను కోరారు.

seetakka
హైదరాబాద్​ అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యం: సీతక్క

మతాల పేరుతో చిచ్చు పెట్టి ఓట్లు రాబట్టేందుకు తెరాస, భాజపాలు ప్రయత్నిస్తున్నాయని ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకురాలు సీతక్క విమర్శించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్‌ నియోజకవర్గంలోని బీఎన్​ రెడ్డి నగర్‌ డివిజన్‌లో సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాహెబ్‌నగర్‌లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు.

గత ఎన్నికల్లో ప్రాంతాలు విభేదాలు చూపించి.. నేడు మతాల పేరుతో చిచ్చు పెట్టడానికి తెరాస, భాజపా ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్​ పార్టీ అన్ని మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సామరస్యంగా సంప్రదాయాలను గౌరవించే విధంగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.