ETV Bharat / state

గోరక్షకులను బెదిరించ లేదా?.. సజ్జనార్​కు రాజాసింగ్ ప్రశ్న

author img

By

Published : Dec 23, 2020, 8:50 AM IST

గోవుల అక్రమ రవాణాకు పోలీసులు సహకరిస్తున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన ఆరోపణలను సీపీ సజ్జనార్ వ్యతిరేకించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సజ్జనార్ వ్యాఖ్యలపై రాజాసింగ్ ఏమని స్పందించారంటే...

mla-rajasingh-reply-to-cp-sajjanar-on
'నా మీద కేసు పెట్టినా ఓకే... తప్పు మీదైతే ఏం చేస్తారు?'

సైబారాబాద్​ కమిషనరేట్​ పరిధిలో చెక్​పోస్టులు ఏర్పాటు చేసి... అక్కడ ఒక్కో కానిస్టేబుల్​ను నియమిస్తే... గోవుల అక్రమ రవాణా జరగదని ఎమ్మెల్యే రాజాసింగ్... సీపీ సజ్జనార్​ను కోరారు. గోవుల అక్రమ రవాణాపై రాజాసింగ్​ చేసిన వ్యాఖ్యలను సీపీ ఖండించారు. బహిరంగంగా పోలీసులను దూషిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా... ఎమ్మెల్యే దీనిపై స్పందించారు.

''సైబరాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ముందు నుంచి వధించేందుకు ఆవులు తీసుకెళ్లడం లేదా? దీనికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలించండి. గో రక్షకులు లారీలను పట్టుకొని పోలీస్​స్టేషన్​కి తీసుకొస్తే.. వారిని దుర్భాషలాడి కేసులు నమోదు చేస్తామని బెదిరించారా లేదా? ఇది కూడా తెలుసుకోండి. మా తప్పు ఉంటే.. నా మీద కేసులు బనాయించిన నేను రెడీ. ఒకవేళ పోలీసులది తప్పని తెలిస్తే ఏంచేస్తారు?''

-ఎమ్మెల్యే రాజాసింగ్

తనకు సీపీ సజ్జానార్​పై ఎంతో గౌరవం ఉందని రాజాసింగ్ తెలిపారు. చెక్​పోస్టుల ఏర్పాటు చేసి.. అక్కడ కానిస్టేబుల్​ను నియమించాలని కోరారు. వారి ప్రవర్తనలో మార్పు రాకుంటే తమ ప్రవర్తనలో కూడా మార్పు రాదని తేల్చి చెప్పారు.

ఇదీ చూడండి: 'పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.