ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అధికార పార్టీ ప్రతీకార రాజకీయాలను ప్రజలు గ్రహించారని పేర్కొన్నారు. భాజపాకు ఇంతటి భారీ విజయాన్ని చేకూర్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెరాస పార్టీ అధికర దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ... ఈటల విజయాన్ని ఆపలేకపోయిందని పేర్కొన్నారు. ఈటల గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు రాజాసింగ్ అభినందనలు తెలిపారు.
24 వేల 68 ఓట్ల మెజార్టీతో ఈటల విజయం..
హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ విజయ కేతనం ఎగురవేశారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై ఘన విజయం సాధించారు. భాజపా- తెరాస హోరాహోరిగా తలపడిన హుజురాబాద్ ఉపఎన్నికలో తొలి రౌండ్ నుంచే ఈటల రాజేందర్ ఆధిపత్యం సాధించారు. కేవలం రెండు రౌండ్లలో మాత్రమే స్వల్ప తేడాతో వెనుకబడ్డ ఈటల మొత్తంగా... 22 రౌండ్లలో 24 వేల 68 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు.
ఇదీ చదవండి: ktr tweet: హుజూరాబాద్ ఓటమిపై కేటీఆర్ ఎలా స్పందించారంటే...