భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్... సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు మరోసారి సవాల్ విసిరారు. ఐదు రోజుల్లో గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే రంగంలోకి దిగుతానని రాజాసింగ్ హెచ్చరించారు. బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఆవులను అక్రమంగా తరలిస్తోన్న వీడియోలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే బయటపెట్టారు.
పోలీస్ కమిషనర్‌పై తనకు గౌరవముందన్న రాజాసింగ్... చేతకాకుంటే అనే పదాన్ని తాను ఉపయోగించవచ్చునని స్పష్టం చేశారు. ఇప్పటికైనా చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులపై కామెంట్లు చేయడం కాదని అక్రమంగా గోవులను తరలిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: హైకోర్టు సీజేగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణస్వీకారం