Rajasingh supporters protest: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లోని బేగంబజార్ మార్కెట్ వ్యాపారులు బంద్ చేశారు. అతనిపైన అక్రమంగా పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారని ఆందోళనకు దిగారు. నగరంలోని బేగంబజార్, ముక్తార్ గంజ్, మహారాజ్ గంజ్, కిషన్ గంజ్ ప్రాంతాల్లో మార్కెట్లలో దాదాపు 1000 దుకాణాల వ్యాపారాలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి రాజాసింగ్‌కు మద్దతుగా నిలిచారు. బేగంబజార్‌లో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌కు నిరసనగా గోషామహల్ నియోజకవర్గ వర్గంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎంజే మార్కెట్ కూడలి వద్ద రాజాసింగ్ అభిమానులు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బషీర్ బాగ్ కమిషనర్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యతిరేక వర్గీయులు నిరసనకు దిగారు. జాతీయ జెండాలు చేతపట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాజా సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ కార్యాలయం ముందు రోడ్‌పై బైఠాయించి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఇవీ చదవండి: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు, పీడీ యాక్ట్ కింద చర్లపల్లికి తరలింపు
ఆ నీళ్లు తాగే దమ్ము కేసీఆర్‌కు ఉందా అంటూ బండి సవాల్
టిక్‌టాక్ స్టార్ మృతి కేసులో ట్విస్ట్, హత్యేనని తేల్చిన పోలీసులు, ఇద్దరు అరెస్ట్