సమాజ వ్యవస్థను ప్రభావితం చేసిన మహానీయుడు భీష్మ పితామహుడని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని గంగపుత్ర సంఘం ఏర్పాటు చేసిన వేషధారణ ప్రదర్శన అందరిని విశేషంగా ఆకట్టుకుంది.
భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడని అన్నారు. ధర్మ సంస్థాపన కోసం భూలోకంలో అవతరించిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వారిలో భీష్ముడిదే మొదటి స్థానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్రులు పెద్దఎత్తున పాల్గొని ఊరేగింపు నిర్వహించారు.