ముషీరాబాద్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ కుటుంబాలకు షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్లు సునీత ప్రకాశ్ గౌడ్, సుప్రియ, నవీన్ గౌడ్, రవిచారి, మహమ్మద్ గౌస్ ఉద్దీన్ పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంపూర్ణ ఆరోగ్యం కోసం అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన కొత్త విధానాన్ని అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం సంక్షేమ, విద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చూడండి: అక్రమ క్వారీలపై పీసీబీ చర్యలు.. హైకోర్టు సంతృప్తి