ETV Bharat / state

బీఆర్​ఎస్​ ఎంపీలు గెలవకపోతే పార్లమెంటులో తెలంగాణ పేరు అనామకం అవుతుంది : కేటీఆర్

MLA KTR on Parliament Elections 2023 : తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవకపోతే పార్లమెంటులో తెలంగాణ అనే పేరు అనామకం అవుతుందన్నారు. తెలంగాణ డిమాండ్లను కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు ఎప్పుడూ ప్రస్తావించలేదని గుర్తు చేశారు.

MLA KTR Press Meet at Telangana Bhavan
MLA KTR Press Meet
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2024, 7:15 PM IST

Updated : Jan 3, 2024, 10:20 PM IST

MLA KTR on Parliament Elections 2023 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేయలేకపోతే కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయమని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లోక్ సభ నియోజకవర్గాల వారీ సన్నాహక సమావేశాలను బీఆర్‌ఎస్‌ ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్, హరీశ్‌రావు, తదితర సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ముఖ్యనేతల అభిప్రాయాలు, ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు. కొందరు నేరుగా అభిప్రాయాలు చెప్పగా మరికొందరు లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎంగా కేసీఆర్‌ లేకపోవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని కేటీఆర్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌పై జరిగిన దుష్ప్రచారం వల్లే ఓడిపోయామని కొందరు చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు(Congress 420 Guarantees) ఇచ్చి గెలిచిందని వివరించారు. పార్లమెంటు ఎన్నికలకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అక్కడక్కడ బీఆర్‌ఎస్‌ నేతలపై దాడులకు దిగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఆగడాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగడతామని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

'ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తాం - తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం'

KTR Fires on Congress and BJP : బీఆర్‌ఎస్‌ ఎంపీలనే ఎందుకు గెలిపించాలో ప్రజలకు చెప్తామని కేటీఆర్‌ వివరణ ఇచ్చారు. తెలంగాణ గళం, బలం, దళం పార్లమెంటులో చూడాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమేనన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రధాన కేంద్రం, ప్రధాన అజెండా తెలంగాణ(Telangana)నే అని చెప్పారు. దేశంలో ఒక్కో రాష్ట్రం పేరు చెప్తే ఒక్కో నేత గుర్తు వస్తారని, అలా జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కేసీఆర్‌ పేరు మాత్రమేనని హర్షించారు.

కేసీఆర్‌ వల్ల తెలంగాణ వచ్చింది, ఈ రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందని, ఈ రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడటం కాంగ్రెస్‌, బీజేపీ వల్ల కాదని ధ్వజమెత్తారు. తెలంగాణ గురించి పార్లమెంటులో రాహుల్‌, మోదీ ఎప్పుడైనా మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవకపోతే పార్లమెంటులో తెలంగాణ అనే పేరు అనామకంగా అవుతుందన్నారు.

"తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన వాగ్దానాలు 420. వాళ్లు యూత్‌ డిక్లరేషన్‌, ఎస్సీ డిక్లరేషన్‌లలో ఏమి చెప్పారు. ఈ పుస్తకాన్ని ఇంటింటికీ చేరే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తాం. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తాం. బీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిస్తే పార్లమెంటులో తెలంగాణ గళం ఎత్తగలం." - కేటీఆర్‌, ఎమ్మెల్యే

బీఆర్‌ఎస్‌ ఎంపీలు లేకపోతే తెలంగాణ మాయం : తెలంగాణ డిమాండ్లను కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు ఎప్పుడూ ప్రస్తావించలేదని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు లేకపోతే తెలంగాణ అనే పదమే మాయం అయ్యే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య మళ్లీ మంచి అవగాహన ఏర్పడిందని, రేవంత్‌ రెడ్డిని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పొగుడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

బీఆర్​ఎస్​ ఎంపీలు గెలవకపోతే పార్లమెంటులో తెలంగాణ పేరు అనామకం అవుతుంది : కేటీఆర్

తెలంగాణకు అస్థిత్వమే కాదు - ఆస్తులు కూడా సృష్టించాం : కేటీఆర్‌

దేశానికి టార్చ్ బేరర్​గా మారిన తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వం : కేటీఆర్‌

Last Updated : Jan 3, 2024, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.