ETV Bharat / state

పార్టీలు ఏవైనా.. ప్రజాప్రతినిధులందరు ఒకటే: తలసాని

గోషామహల్​లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్​తో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపునకు గురైన బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. త్వరలోనే కాలనీలోని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

minster talasani Srinivas yadav and mla raja Singh distribute money to flood effectives in gosh mahal
పార్టీలు ఏవైనా.. ప్రజాప్రతినిధులందరు ఒకటే: తలసాని
author img

By

Published : Oct 23, 2020, 2:36 PM IST

గోషామహల్​ నియోజకవర్గంలోని అబిడ్స్ చిరాగ్​ గల్లీ, నేతాజీ నగర్​లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​తో కలిసి పర్యటించారు. వరద ముంపునకు గురైన బాధితులకు రూ. 10వేల ఆర్థిక సహాయం అందించారు.

ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సమస్యలను మంత్రికి చెప్పుకునేందుకు వచ్చిన భాజపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళనకు దిగి... ప్రభుత్వానికి, మంత్రి తలసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానికుల సమస్యలు తెలుసుకున్న మంత్రి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులంతా ఒకటేనని... పార్టీలు మాత్రమే వేరు అని... అందరికీ సేవ చేయడంలో కలిసి ముందుకు వెళ్తామని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.