ETV Bharat / state

BRS: 'జాతీయ స్థాయిలో విస్తరించి.. BRS మరిన్ని విజయాలు సాధించాలి' - KTR congratulated BRS foundation day

Ministers on BRS Formation Day: తెలంగాణ ప్రజలకు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలుస్తూ.. దేశానికే రోల్ మోడల్‌గా మారిందని నేతలు వ్యాఖ్యానించారు.

ministers
ministers
author img

By

Published : Apr 27, 2023, 1:37 PM IST

Ministers on BRS Formation Day: తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడిన గులాబీ పార్టీ నేడు 22 సంత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా పురుడుపోసుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునః ప్రతిష్టించిందని పేర్కొన్నారు. అనతికాలంలోనే ప్రత్యేక రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా సీఎం కేసీఆర్ నిలిపారని వివరించారు. ఈ 22 ఏళ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

"రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీగా పురుడుపోసుకుంది. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించింది. అనతికాలంలోనే ప్రత్యేక రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత కేసీఆర్. 22 ఏళ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, ప్రజలకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు." - కేటీఆర్, మంత్రి

  • రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించి, అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత మన కేసీఆర్

    22 ఏండ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు,… pic.twitter.com/cTtWULfFx5

    — KTR (@KTRBRS) April 27, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేశానికే రోల్ మోడల్‌గా: స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్‌ అని.. ఉజ్వల భారత్‌ కోసం నేడు బీఆర్‌ఎస్‌ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ సారథ్యంలో 22 ఏళ్ల క్రితం ఉద్యమ పార్టీ పురుడు పోసుకుందని అన్నారు. ఈ క్రమంలోనే స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిందని తెలిపారు. అనతి కాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలుస్తూ.. దేశానికే రోల్ మోడల్‌గా మారిందని హరీశ్‌రావు వివరించారు.

అగ్రస్థానంలో రాష్ట్రం: సంక్షేమం.. అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలికిందంటూ హరీశ్‌రావు కొనియాడారు. 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్.. తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను దేశవ్యాప్తం చేసేందుకు బయలుదేరారంటూ వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి కోసం తలపెట్టిన మహాయజ్ఞంలో భాగంగా.. జాతీయ స్థాయిలో విస్తరించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

  • స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్.!
    ఉజ్వల భారత్‌ కోసం నేడు బీఆర్‌ఎస్‌.

    కేసీఆర్ గారి సారథ్యంలో 22ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసింది.

    అనతి కాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలిచి, దేశానికే… pic.twitter.com/JQrvSwX9JA

    — Harish Rao Thanneeru (@BRSHarish) April 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు బీఆర్ఎస్‌గా ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి.. పలు జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ అంశాలపై తీర్మానాలు చేయనున్నారు.

ఇవీ చదవండి: BRS Foundation Day: 23వ వసంతంలోకి BRS.. తెలంగాణభవన్​లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

నరేంద్ర మోదీపై కేసు.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారని..

'చచ్చి బతికాం- ఇండియన్స్ అని చెప్తే వదిలేశారు'.. సూడాన్ నుంచి వచ్చిన భారతీయుల మనోగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.