శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో ప్రభుత్వం విడుదల చేసిన చేప పిల్లలను అలివిగాని వలలతో వేటాడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మత్స్యశాఖ కమిషనర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులతో బృందాలను ఏర్పాటు చేయాలని వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ లక్ష్యాలకు గండికొట్టే వారు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని సూచించారు. నిషేధిత వలలతో చేపల వేట అరికట్టేందుకు మత్స్యశాఖ అధికారిని పర్యవేక్షకుడిగా నియమించిన నేపథ్యంలో... ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య శాఖ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.