గణేశ్ ఉత్సవాలను(ganesh chaturthi celebrations) కరోనా(corona) నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఈసారి గణేష్ నిమజ్జనోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటామని మంత్రి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో(ghmc) జరగనున్న గణేశ్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఎంసీహెచ్‌ఆర్డీలో(mchrd) ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి మంత్రి హాజరయ్యారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ గణేశ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి. ఈనెల 10 నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి. ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం.
-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సెప్టెంబర్ 10 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు. ఉత్సవాలతోపాటు శాంతిభద్రతలు కూడా చాలా ముఖ్యమని డీజీపీ మహేందర్ రెడ్డి(dgp mahender reddy) అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని డీజీపీ పేర్కొన్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి(indrakaran reddy), మల్లారెడ్డి(malla reddy), డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్(cs somesh kumar), మేయర్ విజయలక్ష్మి(mayor vijayalakshmi), గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మనం ఏటా గణేశ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాం. హైదరాబాద్ నగరంలో దేదీప్యమానంగా నిర్వహించుకుంటాం. వీటిలో శాంతిభద్రతలు చాలా ముఖ్యమైన అంశం. ఈ సందర్భంగా ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని పట్టణాలు, నగరాల్లోని పోలీసు సిబ్బందిని సంసిద్ధం చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ రంగాల సహకారంతో ఈసారి ఉత్సవాలను జరుపుకుందాం.
-మహేందర్ రెడ్డి, డీజీపీ
ఇదీ చదవండి: Kishan Reddy: 'కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బంగారు మయమైంది'