ETV Bharat / state

మల్లారెడ్డిపై దాడి వెనుక ఎవరున్నా... వదిలిపెట్టే ప్రసక్తే లేదు: తలసాని - Minister talasani on revanth

Minister talasani on minister mallareddy issue: ఆదివారం మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడి గురించి మంత్రి తలసాని స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడులు సరికాదని తెలిపారు. వ్యవహారం వెనుక ఎవరున్నా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

Minister talasani on minister mallareddy issue
తలసాని
author img

By

Published : May 30, 2022, 3:32 PM IST

Minister talasani on minister mallareddy issue: మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడిని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడులు సరికాదన్నారు. ఆదివారం మేడ్చల్ నియోజకవర్గంలో జరిగిన రెడ్ల సింహగర్జన సభకు అనుమతులు ఇప్పించి సహకరించిన మల్లారెడ్డిపైనే దాడి చేయడమేంటని ప్రశ్నించారు. వేదికపై మంత్రి అన్ని విషయాలు చెప్పారని తెలిపారు.

సభలో ఆ ఒక్క విషయమే చెప్పాలా? రెడ్డి కార్పొరేషన్‌ గురించే మాట్లాడాలని అనడం సబబుకాదని మండిపడ్డారు. ఓ బాధ్యత గల మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చారని వివరించారు. ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం చేసిన అంశాలను వివరించారని తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందని హెచ్చరించారు. ఈ ఘటనలో ఎవరినీ ఉపేక్షించమని మంత్రి తలసాని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడులు సరికాదు. సభకు అనుమతి ఇప్పించిన మంత్రిపైనే దాడి చేయడమేంటి? ఒక మంత్రిగా ప్రభుత్వం చేసిన పనులు చెబుతారు. రెడ్డి కార్పొరేషన్‌ గురించే మాట్లాడాలని అనడం సబబుకాదు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటుంది. - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌

మల్లారెడ్డిపై దాడి వెనుక ఎవరున్నా... వదిలిపెట్టే ప్రసక్తే లేదు: తలసాని

సంబంధిత కథనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.