ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉన్నందున అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పోరేటర్లతో సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలు మంజురైనాయని తెలిపారు. వాటిలో ఇప్పటికే కొన్ని పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి పనులు వేగంగా చేపట్టేందుకు లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
ఇదీ చూడండి: రెండోరోజు 'ఉద్దీపన'లపై కోటి ఆశలు!