హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్‌పేట డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. డివిజన్ పరిధిలో రూ.13 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను, రూ. 15 లక్షలతో ఏర్పాటు చేయనున్న టేబుల్ డ్రెయిన్ పనులను గురువారం స్థానిక కార్పొరేటర్ అరుణతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ప్రజల అవసరాల ఏర్పాటు కోసం తామెప్పుడూ ముందుంటామని మంత్రి పేర్కొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణాలను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం కొందరు వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి 25 మంది భాజపా కార్యకర్తలు మంత్రి తలసాని సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
ఇదీ చదవండిః తెరాస ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం