హైదరాబాద్లో 23వ జాతీయ సెపక్ టక్రా ఛాంపియన్షిప్-2019 నిర్వాహణపై క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో సెపక్ టక్రా రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి ప్రేమ్ రాజ్, ఉపాధ్యక్షులు ఐలయ్య యాదవ్, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రాజేశ్వర్, వికేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, సెపక్ టక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో... చాదర్ ఘట్లోని విక్టరీ ప్లే మైదానంలో డిసెంబర్ 11 నుంచి 15 వరకు నిర్వహిస్తున్నట్లు మంత్రికి కార్యవర్గ సభ్యులు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడాల అభివృద్ధికి, క్రీడాకారులకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఇవీ చూడండి: విధుల్లోకి తీసుకుంటారని భావిస్తున్నాం: అశ్వత్థామరెడ్డి