హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ "శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వరస్వామి- సురమాంబతల్లి నిత్య పూజా విధానం" పుస్తకాన్ని ఆవిష్కరించారు. గౌడ్‌లను కౌండిన్య ధర్మ మార్గంలో నడిపించడానికి పురాతన గౌడ పురాణాలను సేకరించి ఈ పుస్తకాన్ని డా. వట్టికూటి రామారావు గౌడ్ రచించారని మంత్రి వివరించారు.
శివుడి కుమారుడు, గౌడ తాటి- ఈత వన రక్షకుడు శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వరస్వామి-సురమాంబతల్లి దేవాలయాల నిర్మాణం, పూజా విధానం గురించి ఈ పుస్తకంలో వివరించారన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె లక్ష్మణరావు గౌడ్, పుస్తక రచయిత డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్, గౌడ గురు పూజారులు పాల్గొన్నారు.