మహిళలు తమపై జరుగుతున్న దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బీసీ మహిళా వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి, బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు మణిమంజరి సాగర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
మహిళల గురించి వేదికలపై రాజకీయ నాయకులు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఆడ, మగ అనే తారతమ్య బేధం లేకుండా పిల్లలను స్వేచ్ఛగా పెంచాలని కోరారు. చట్టసభలో మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. పలువురు మహిళలు వేదికపై సంప్రదాయ వస్త్రధారణతో చేసిన క్యాట్‌వాక్ మంత్రముగ్ధులను చేసింది.
ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ లేని వాహనాల సీజ్