ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేశారని అభిప్రాయపడ్డారు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సౌత్ ఏషియన్ గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్లో రెండు బంగారు పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారిణి ఆకుల శ్రీజ, యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్లో విజేతగా నిలిచిన స్నేహిత్‌ను మంత్రి సన్మానించారు.
రవీంద్రభారతిలో క్రీడాకారులతో పాటు రైల్వే టేబుల్ టెన్నిస్ కోచ్ సోమనాథ్ ఘోష్‌ని అభినందించారు. క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు కావాల్సిన పూర్తి సహకారం సర్కారు అందిస్తోందన్న మంత్రి.... ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇవీ చూడండి: మీ ఒంట్లో.. నేనుంటేనే.. మీరు ఓకే !