ETV Bharat / state

ఆన్​లైన్​ పాఠాలను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాఠోడ్​ - latest news on Minister Satyavati Rathod

అంగన్​వాడీ చిన్నారుల కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆన్​లైన్​ పాఠ్యాంశాలను రూపొందించింది. మంత్రి సత్యవతి రాఠోడ్​ పాఠాలను ప్రారంభించారు.

Minister Satyavati Rathod started online lessons
ఆన్​లైన్​ పాఠాలను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాఠోడ్​
author img

By

Published : Apr 30, 2020, 5:40 PM IST

లాక్​డౌన్ సందర్భంగా అంగన్​వాడీ పిల్లలు ఇంటి వద్దే ఉండి విజ్ఞానాన్ని పొందేలా మహిళా, శిశు సంక్షేమ శాఖ చిన్న కథలతో ఆన్​లైన్ పాఠ్యాంశాలను రూపొందించింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ ఆన్​లైన్ పాఠాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా లాక్​డౌన్ సమయంలో అంగన్​వాడీల్లో పనిచేసే టీచర్లు, ఆయాలు, అంగన్​వాడీ లబ్ధిదారులకు అందుతున్న సరుకులు, సేవలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు టెలీకాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

కష్టకాలంలోనూ అంగన్​వాడీ సిబ్బంది మంచి సేవలు అందిస్తున్నారని మంత్రి అభినందించారు. మహిళా కార్పొరేషన్ ద్వారా తయారు చేయించిన మాస్కులను సిబ్బందికి రెండో విడతగా అందించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన శానిటైజర్లను సైతం పంపిణీ చేశారు.

బాలికల కోసం ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ అందించిన 2 లక్షల శానిటరీ న్యాప్కిన్లను స్వదార్ హోమ్, సఖీ సెంటర్లు, కనీస సదుపాయాలు లేని గిరిజన ప్రాంతాలకు పంపిణీ చేశారు. అజీమ్​ప్రేమ్​జీ ఫౌండేషన్ సమకూర్చిన రూ. 15 లక్షల విలువైన సరుకులను 10 చిల్డ్రన్ హోమ్స్, 21 ఓల్డేజ్ హోమ్స్​కు అందించారు.

ఇవీచూడండి: మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.