ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీస్ అధికారులతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష నిర్వహించారు. ఈనెల 6న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా 40 శాఖల అధికారులతో సమావేశమయ్యారు. 2019-2020 బడ్జెట్‌లో దాదాపు 70 శాతం నిధులు ఖర్చు చేశామని మంత్రి అన్నారు. కొన్ని శాఖల్లో తక్కువ నిధులు ఖర్చు చేయగా, మరికొన్ని శాఖల్లో నిధుల కేటాయింపు కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు ఆమె తెలిపారు.
కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయితీల్లో మౌలిక వసతుల కోసం రూ. 125 కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ కోసం రూ. 140 కోట్లు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు చెప్పారు. గిరిజన శాఖ ఎక్కువగా విద్యపై ఖర్చు చేస్తుందన్నారు. గురుకుల పాఠశాల ద్వారా గిరిజనులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
ఇదీ చూడండి : వరంగల్ సీపీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు