ETV Bharat / state

జల్​పల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబిత శ్రీకారం

author img

By

Published : May 7, 2021, 10:10 PM IST

Updated : May 7, 2021, 10:24 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఆస్పత్రిని ఆమె ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు.

షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ
షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ ప్రాంతంలోని వాది ఏ హుద క్యాంపస్​లో ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో కొవిడ్ రోగుల కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. ప్రారంభించారు.

ఆస్పత్రిలో 20 ఆక్సిజన్ బెడ్స్, 15 ఐసోలేషన్ బెడ్స్, 10 ఎన్​ఐవీ పడకలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి తన నియోజకవర్గంలో ఆస్పత్రిని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. గతంలోనూ మిషన్​ భగీరథ నీటి ట్యాంక్​ నిర్మాణం, విద్యుత్ సబ్​స్టేషన్​ల నిర్మాణాల కోసం ఈ సంస్థ వారి స్థలాలను ఇచ్చి తమ పెద్ద మనసును చాటుకున్నారని కొనియాడారు.

జమాతే ఏ ఇస్లామి హింద్ తెలంగాణ అధ్యక్షుడు హమీద్ మహమ్మద్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్. బి.నాగేందర్, తెలంగాణ డేర్ అధ్యక్షుడు డాక్టర్​ అహ్మద్ అబ్దుల్ కబీర్, ఎస్​ఐవో స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ తలాహ్ ఫయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

చెక్కుల పంపిణీ..
అనంతరం జల్​పల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో 123 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1.30 కోట్ల విలువ చేసే షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జల్​పల్లి మున్సిపల్​ ఛైర్మెన్ అబ్దుల్లా బిన్ అహ్మద్ సాదీ, కమిషనర్ జీపీ కుమార్, బాలాపూర్ తహశీల్దార్ శ్రీనివాస్​రెడ్డి, కౌన్సిలర్లు, పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. సజావుగా ముగిసిన పురపాలక పరోక్ష ఎన్నికల ప్రక్రియ

Last Updated : May 7, 2021, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.