కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి... విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కష్టజీవులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రమజీవుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారన్నారు. కార్మికలోకం అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: కొవిడ్ వార్డులో నీళ్లు లేక రోగి మృతి.. వీడియో వైరల్!