ETV Bharat / state

అంతర్జాతీయ విత్తన సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు - వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి

అంతర్జాతీయ విత్తన సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 26 నుంచి జూలై 3 వరకు అంతర్జాతీయ విత్తన సదస్సును నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

విత్తన సదస్సు
author img

By

Published : Jun 4, 2019, 5:07 AM IST

Updated : Jun 4, 2019, 6:43 AM IST

విత్తన సదస్సుపై మంత్రి నిరంజన్​రెడ్డి సమీక్ష
అంతర్జాతీయ విత్తన సదస్సుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విత్తన ధృవీకరణ సంస్థ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 26 నుంచి జూలై 3 వరకు అంతర్జాతీయ విత్తన సదస్సును నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సదస్సుకు 70 దేశాల నుంచి ఎనిమిది వందల మంది విత్తన ప్రముఖులు రానున్నారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, భారతదేశ సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

విత్తన ఎగుమతులకు సహకారం

కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి విత్తన ఎగుమతులను సులభతరం చేయడానికి సహకరిస్తామని మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. సదస్సులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జూన్ 24, 25 తేదీల్లో విత్తనోత్పత్తిపై ఆఫ్రికన్ సదస్సు, జూన్ 27న విత్తన రైతుల సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. విత్తన ఎగ్జిబిషన్​ను జూన్ 26, 27 తేదీల్లో, సాంకేతిక కమిటీ సమావేశాలు జూన్ 29 నుంచి జూలై 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు.

ఇదీ చూడండి : సంక్షోభం నుంచి దృష్టి మళ్లించేందుకే 'గ్రామ వాస్తవ్య'

Intro:tg_mbnr_08_02_eedurugalula_bibastam_av_c15
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని పలు గ్రామాలు లోని పట్టణ కేంద్రంలో లో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. దీంతో వివిధ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు భారీ వృక్షాలు విరిగి పడ్డాయి పట్టణంలోని పలు వ్యాపార సంస్థలకు అంతరాయం ఏర్పడింది వాహనదారులకు ఇతర ప్రాంతాల కు చెందినటువంటి పాదచారులకు పలువురు ఇబ్బందులకు గురయ్యారు

Body:ఈదురుగాలుల బీభత్సానికి మామిడి తోటల రైతులు భయాందోళన చెందుతున్నారు ఎన్నడూ లేనివిధంగా ఈదురుగాలులు వీచడంతో తీవ్ర నష్టాలు ఏర్పడతాయని వారు ఆందోళన చెందుతున్నారు

Conclusion:నామని హరీష్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481
Last Updated : Jun 4, 2019, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.