ETV Bharat / state

Niranjan Reddy: 'ఆయిల్‌పామ్ విత్తన మొక్కలపై సుంకం తగ్గించండి'

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ రాశారు. ఆయిల్​పామ్ విత్తన మొలకలపై పెంచిన సుంకాన్ని తగ్గించాలని ఆయన లేఖలో ప్రస్తావించారు.

Minister niranjan reddy
ఆయిల్‌పామ్
author img

By

Published : Aug 17, 2021, 4:52 PM IST

కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ (Oil Palm) విత్తన మొలకలపై పెంచిన సుంకాన్ని తగ్గించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) సూచించారు. దిగుమతి సుంకం పెంపు భారం రైతులపై పడకుండా పాత కేటరిగిలోనే ఉంచాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ (Central Minister Nirmala Seetharaman)ను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి లేఖ రాశారు. దేశంలో నూనె ఉత్పత్తుల స్వయం సంవృద్ధికి తోడ్పడాలని మంత్రి తెలిపారు. పెంచిన దిగుమతి సుంకం నేపథ్యంలో దేశం, రాష్ట్రంలో ఆయిల్​ పామ్‌ అభివృద్ధికి భారీ నష్టం జరుగుతోందన్నారు.

ఆయిల్​పామ్​కు ప్రాధాన్యత...

ఆయిల్‌పామ్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఇక్కడి నేలలు కూడా సాగుకు అనుకూలంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సాగునీటి వసతి 24 గంటల కరెంటు సరఫరా, ఎకరాకు రూ. 5వేల చొప్పున ఏడాదికి రూ. 10 వేలు రైతుబంధు పథకాలతో సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పంటల వైవిధ్యంలో భాగంగా ఆయిల్​పామ్‌ సాగుకు ప్రాధాన్యత కల్పించినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో 20 లక్షల ఎకరాలలో యుద్ధ ప్రాతిపదికన... రాబోయే 2022, 2023 సంవత్సరాలలో 3 లక్షల ఎకరాలలో ఆయిల్​పామ్ సాగుకు ప్రణాళిక సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో నిరంజన్ రెడ్డి వివరించారు. దేశంలో ఆయిల్​పామ్ సాగుకు అవసరానికి తగినంత విత్తన తోటలు లేనందున కోస్టారికా, థాయ్​లాండ్, మలేషియా దేశాల నుంచి విత్తన మొలకలు దిగుమతి చేసుకోవడం జరుగుతుందన్నారు.

హెక్టారుకు రూ.12 వేలు

తెలంగాణలో ఇప్పటికే ప్రకటించిన 8 లక్షల ఎకరాలకు 14.40 కోట్ల విత్తన మొలకలు అవసరం ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ - ఆయిల్​పామ్ నిబంధనల ప్రకారం హెక్టారుకు 12 వేల రూపాయల విలువైన మొక్కల అవసరం ఉందన్నారు. అయితే తాజాగా పెంచిన 30 శాతం సుంకం నేపథ్యంలో దిగుమతి చేసుకుని పెంచి రైతులకు అందించే సమయానికి విత్తన కంపెనీలకు అయ్యే ఖర్చు రూ.240 నుంచి రూ.250 అవుతుందని తెలిపారు.

దీని మూలంగా నూనెల డిమాండ్ , సప్లైల మధ్య భారీ వ్యత్యాసం పెరిగి వినియోగదారులపై భారం పడనుందని పేర్కొన్నారు. ఆయిల్​పామ్ సాగు ప్రోత్సాహానికి రైతులపై భారం తగ్గించేందుకు దిగుమతి ఆయిల్​పామ్ విత్తన మొలకలను 12071010 బదులుగా 12099910 కేటగిరీ కిందనే ఉంచాలని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.

ఇదీ చదవండి: GANDHI HOSPITAL: గాంధీలోనే కాదు.. అన్ని ఆస్పత్రుల్లోనూ రాత్రయితే అదే భయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.