కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బోయిన్పల్లిలోని తన నివాసం వద్ద హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి ఆయన హోలీ సంబురాలు జరుపుకున్నారు. చిన్నా.. పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సంబురాల్లో పాల్గొన్నారు.
చిన్నారులు రంగుల్లో తేలియాడుతూ... సందడి చేశారు. కరోనా నిబంధనలను దృష్టిలో ఉంచుకుని కొద్దిసేపు మాత్రమే మల్లారెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. వారితో ఓ ఫోటో దిగి ఇంట్లోకి వెళ్లిపోయారు. చిన్నారులకు, రాష్ట్ర ప్రజలకు కరోనా విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
- ఇదీ చదవండి : కరోనా యోధులకు కరవైన ప్రభుత్వ సాయం