Minister KTR With Tribal Entrepreneurs in Hyderabad : ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా ప్రతిభా పాటవాలు దాగి ఉంటాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కొద్దిగా తెలివి తేటలకు సృజనాత్మకతను జోడించి మార్కెటింగ్ చేసుకుంటే తిరుగులేని పారిశ్రామికవేత్తలను నిర్మించుకోవచ్చునని మంత్రి వివరించారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సీఎం షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్.. ఇన్నోవేషన్ స్కీమ్ సక్సెస్ మీట్‌కు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమానికి గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎంపీ సీతారాం నాయక్, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్ హాజరయ్యారు.
KTR Participate Tribal Entrepreneurs Success Meet : ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే నెల 3వ తేదీ తర్వాత తిరిగి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. దేవుడు మనిషిని పుట్టించాడని.. మనిషి కులాన్ని పుట్టించాడని పేర్కొన్నారు. ప్రతి మనిషికి సమానమైన తెలివితేటలు ఉంటాయని.. బలంగా నమ్ముతానని మంత్రి పేర్కొన్నారు. టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదన్న ఆయన.. సరైన సమయంలో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సీఎంఎస్టీఈఐ కింద 500 మంది గిరిజన యువతకు లబ్ది కల్పించడమంటే ఆషామాషీ విషయం కాదన్నారు.
Tribal Entrepreneurs Success Meet in Hyderabad : ఈ పథకం కింద గిరిజన వ్యవస్థాపకులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎదగాలని మంత్రి తెలిపారు. ఈ ఐదేళ్లలో నేర్చుకున్న పాఠాలతో రాబోయే రోజుల్లో 5 వేల మంది యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రత్యేక గిరిజన పార్క్‌ను ఏర్పాటు చేద్దామన్నారు. కలలు కనండని.. అలాగే ఉన్నత ఆలోచనలతో ముందుకు వెళ్లాలని యువతకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని పేర్కొన్నారు. అయినా సరే పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగారని మంత్రి స్పష్టం చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోలేదన్నారు. ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని చెప్పడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితమే మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ చాలా ఇబ్బంది పడినట్లు చెప్పారు. కానీ, ఇలాంటి కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా అనిపించిందని మంత్రి వివరించారు.
'గతంతో పోలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. గత ప్రభుత్వాల అసమర్థత వల్ల అభివృద్ధి పనులు జరగలేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుంది. ఇన్వర్టర్, జనరేటర్ అవసరం లేకుండా కరెంట్ సరఫరా జరుగుతుంది. పార్లమెంట్‌లో ముస్లిం ఎంపీ హక్కుల కోసం మాట్లాడితే ఉగ్రవాది అని అంటున్నారు. గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్‌లో ఎండకాలం వస్తే నీటి గోస. గతంలో రంజాన్, గణేష్ నిమజ్జనం వస్తే కర్ఫ్యూ విధించేవారు. ఐటీ రంగంలో బెంగళూరును దాటి ముందుకు దూసుకెళ్తున్నాం. 2014లో 3.23 లక్షల ఉద్యోగాల నుంచి 10 లక్షల ఉద్యోగాలకు పెరిగింది.' -కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
Minister KTR in Tribals Success Meet : అమెరికాలోని నగరాలతో పోలిస్తే హైదరాబాద్ గొప్పగా ఉందని ప్రపంచ సంస్థలు చెబుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. గతంతో పోలీస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. గత ప్రభుత్వాల అసమర్థత వల్ల అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుందన్న మంత్రి.. ఇన్వర్టర్, జనరేటర్ అవసరం లేకుండా కరెంట్ సరఫరా జరుగుతుందని తెలిపారు. ఐటీ రంగంలో బెంగళూరును దాటి ముందుకు దూసుకెళ్తున్నామని చెప్పారు. 2014లో 3.23 లక్షల ఉద్యోగాల నుంచి 10 లక్షల ఉద్యోగాలకు పెరిగిందన్నారు.
'దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య పోటీ అంటూ రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు'