KTR inauguration at medical device park: హైదరాబాద్ సుల్తాన్ పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కులో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. నేడు ఏడు లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీలను ప్రారంభించనున్నారు. తద్వారా రూ. 265 కోట్ల పెట్టుబడిని, 1300 ఉద్యోగాలను ఈ కంపెనీలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభానికి సిద్ధమైన ప్రోమియా థెరపెటిక్స్, హువెల్ లైఫ్ సైన్సెస్, ఆక్రితి ఆక్యులోప్లస్ట్రీ, ఆర్కా ఇంజినీర్స్, ఎస్వీపీ టెక్నో ఇంజినీర్స్, ఎల్వికాన్ అండ్ రీస్ మెడిలైఫ్ యాజమాన్యాలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
బిలియన్ డాలర్ల పరిశ్రమగా...
ఈ నూతన యూనిట్లలో రాష్ట్రం నుంచి ఇన్ విట్రో డయాగ్నొసిస్, కేర్ డివైజెస్, అనలైజర్లు, ఆక్యులర్ ఇంప్లాట్స్, సర్జికల్, డెంటల్ ఇంప్లాట్స్, వుండ్ డ్రెస్సింగ్ వంటి మెడికల్ ఉత్పత్తులను ఈ కంపెనీలు తయారుచేయనున్నాయి. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ఇండస్ట్రియల్ పార్కులో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి రావటం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2030 కల్లా తెలంగాణ లైఫ్ సైన్సెస్ను వంద బిలియన్ డాలర్ల పరిశ్రమగా మలిచేందుకు ఇదొక ముందడుగని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
-
A big day for Telangana!
— KTR (@KTRTRS) December 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Very happy to announce that I will be inaugurating 7 factories in the Medical Devices Park, Sultanpur, today. This is a big milestone for India's largest such industrial park, which I had the pleasure of launching 4 years ago.#TrailblazerTelangana pic.twitter.com/LxhjiLw53P
">A big day for Telangana!
— KTR (@KTRTRS) December 15, 2021
Very happy to announce that I will be inaugurating 7 factories in the Medical Devices Park, Sultanpur, today. This is a big milestone for India's largest such industrial park, which I had the pleasure of launching 4 years ago.#TrailblazerTelangana pic.twitter.com/LxhjiLw53PA big day for Telangana!
— KTR (@KTRTRS) December 15, 2021
Very happy to announce that I will be inaugurating 7 factories in the Medical Devices Park, Sultanpur, today. This is a big milestone for India's largest such industrial park, which I had the pleasure of launching 4 years ago.#TrailblazerTelangana pic.twitter.com/LxhjiLw53P
ఇదీ చదవండి: PHCS in TS: అక్కరకురాని కేంద్రాలు.. వైద్యులు లేక నిరుపయోగంగా సబ్‌సెంటర్లు..!