ETV Bharat / state

'వదిలించుకోవడం ఎందుకు... వృద్ధిలోకి తెద్దాం..' - Minister Ktr on adilabad ccs

KTR Tweet on Adilabad CCS: ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పునఃసమీక్షించాలని ట్వీట్ చేశారు. ఉత్తర్వులపై సమీక్షించాలని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కోరారు.

Minister Ktr tweet on central minister piyush goyal
'ఆ ఉత్తర్వులపై పునఃసమీక్షించండి.. మా నుంచి సహకారం ఉంటుంది'
author img

By

Published : May 17, 2022, 12:11 PM IST

KTR Tweet on Adilabad CCS: ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై ఈనాడు-ఈటీవీ భారత్ కథనాలపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు స్పందించారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులను పునఃసమీక్షించి... పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ట్విటర్ వేదికగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్​ను కేటీఆర్ కోరారు. సీసీఐ పునరుద్ధరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ప్రాంతంలోని వేలాది యువతకు ఉపాధి కల్పించే సీసీఐ పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు.

''కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ గారు... ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున‌ఃసమీక్షించుకోండి. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాం. ఉపాధి కల్పించే పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తాం. '' - ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్

  • Appeal to @PiyushGoyal Ji & Govt of India to review & take positive decision to revive the Cement Corporation of India unit in Adilabad

    We will extend all support from state Govt & provide needed fiscal incentives to ensure thousands of youth from Adilabad are gainfully employed https://t.co/8OAsFgCEGt

    — KTR (@KTRTRS) May 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.