రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ సేవలు మరింత విస్తరించాలని మంత్రి కేటీఆర్ (Minister KTR) కోరారు. కొవిడ్‌పై పోరులో భాగంగా టెక్ మహీంద్ర ఫౌండేషన్ (Tech Mahindra Foundation) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎర్రగడ్డ సెంట్ థెరిసా (st.theresa hospital) ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను(Oxygen plant) కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు.
సీఎస్‌ఆర్ కింద మహీంద్రా గ్రూప్ అందించిన ఏడు అంబులెన్స్‌లను గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన చోట ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. మహీంద్రా గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మహీంద్రా గ్రూప్ మరిన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మహీంద్రా గ్రూప్ జహీరాబాద్‌లో లక్ష పైచిలుకు ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు.
హైదరాబాద్‌లో టెక్ మహీంద్రా హెడ్ క్వార్టర్స్ ఉంది. 24వేల పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వరంగల్‌లో కూడా వారి కార్యకలాపాలను విస్తరించారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో భాగంగా రాష్ట్రంలో మహీంద్రా యూనివర్సిటీని నెలకొల్పడం జరిగింది. ఇలా ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అండగా ఉంటోంది. ఇవాళ ఏడు అంబులెన్స్‌లు, రూ. కోటి విలువైన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.. భవిష్యత్‌లో మరిన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నా....
- కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి