ETV Bharat / state

KTR on Seed Copters: దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో సీడ్​ కాప్టర్లు - తెలంగాణ వార్తలు

సీడ్ కాప్టర్లను (Seed Copters) దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. హరిత తెలంగాణ(HARITHA TELANGANA) సాధనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. సీడ్ కాప్టర్ల పనితీరును వివరిస్తూ తయారు చేసిన ఓ వీడియోని కేటీఆర్ తన ట్విటర్(KTR TWITTER)​లో పోస్ట్ చేశారు.

KTR about seed copter, minister ktr twitter
సీడ్ కాప్టర్లపై మంత్రి కేటీఆర్, మంత్రి కేటీఆర్ ట్విటర్
author img

By

Published : Sep 5, 2021, 12:38 PM IST

హరిత తెలంగాణ(HARITHA TELANGANA) సాధనలో సీడ్ కాప్టర్లు(SeedCopters) కీలక భూమిక పోషించనున్నటు మంత్రి కేటీఆర్ ట్విటర్(KTR TWEET) వేదికగా ప్రకటించారు. తగ్గిపోతున్న అడవులను కాపాడుకోవటంతో పాటు తిరిగి మొక్కలు పెంచటం ముఖ్యమన్న కేటీఆర్.... ఇందుకోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర ఐటీ శాఖ, అటవీ శాఖలు సంయుక్తంగా టీవర్క్స్ , రిచ్ సంస్థలతో కలిసి ఈ సీడ్ కాప్టర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు సీడ్ కాప్టర్ల పనితీరును వివరిస్తూ తయారు చేసిన ఓ వీడియోని సైతం కేటీఆర్ తన ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. సీడ్ బాల్స్​ని తయారుచేసి... వాటిని డ్రోన్ల సాయంతో అడవుల్లో వెదజల్లటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఇందుకు ఉపయోగించే డ్రోన్ల వంటి పరికరాలనే సీడ్ కాప్టర్లుగా పేర్కొన్నారు.

ఈ సీడ్ కాప్టర్లు ముందుగా అటవీ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేసి... మొక్కలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీడ్ బాల్స్​ని వెదజల్లుతాయి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత సైతం పలుమార్లు వాటి పెరుగుదలను సర్వే చేసేందుకు ఉపయోగపడనున్నాయి. నటుడు రానా, పద్మశ్రీ అవార్డు గ్రహీత మ్యాన్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ జయదేవ్ పయోంగ్, పద్మశ్రీ గ్రహీత పర్యావరణవేత్త దిరిపల్లి రామయ్య.. ఈ పథకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.

  • Technology to aid Green mission in #Telangana

    SeedCopters will help in rejuvenation of degraded forest blocks across the state

    Hon’ble CM KCR’s flagship #HaritaHaaram would be further strengthened by this initiative

    My Compliments to Forest dept, IT dept & Marut drones 👍 pic.twitter.com/JylZ44hKv1

    — KTR (@KTRTRS) September 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: RAINS EFFECT: చౌటుప్పల్ జలమయం.. కాలనీల్లో చేరిన వరద నీరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.