ETV Bharat / state

అక్టోబర్ రెండో వారంలోగా పూర్తి కావాలి: కేటీఆర్ - బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ చీరలు, నేతన్నల కోసం తీసుకోవాల్సిన కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే బతుకమ్మ చీరల సంబంధించిన ఉత్పత్తి దాదాపు పూర్తి కావొచ్చిందని ఆయన తెలిపారు.

బతుకమ్మ చీరల పంపిణీ పూర్తి కావాలి: కేటీఆర్

author img

By

Published : Aug 31, 2020, 8:38 PM IST

అక్టోబర్ రెండో వారంలోగా బతుకమ్మ చీరల పంపిణీ పూర్తి కావాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ చీరలు, నేతన్నల కోసం తీసుకోవాల్సిన కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే బతుకమ్మ చీరలకు సంబంధించిన ఉత్పత్తి దాదాపు పూర్తి కావొచ్చిందని, వాటి పంపిణీపై దృష్టి సారించినట్లు అధికారులు తెలియజేశారు.

బతుకమ్మ పండుగకు కనీసం వారం రోజుల ముందు నుంచే చీరల పంపిణీ ప్రారంభం కావాలన్న కేటీఆర్... అక్టోబర్ రెండో వారంలోగా పంపిణీ పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ జరిగేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో నేతన్నకు చేయూత పథకానికి సంబంధించిన పొదుపు డబ్బులను గడువుకు ముందే తీసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు నేతన్నలకు ఎంతో మేలు చేకూర్చిందని మంత్రి అన్నారు.

చేనేత కార్మికులకు సుమారు రూ. 96.43 కోట్లు, పవర్ లూమ్ కార్మికులకు సుమారు రూ. 13 కోట్లు మొత్తంగా రూ. 110 కోట్ల నిధులు డబ్బులు రాష్ట్రంలోని నేతన్నలకు అందుబాటులోకి వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం టెస్కో వస్త్రాలకు మరింత బ్రాండింగ్ కల్పించే ప్రయత్నాలను వెంటనే ప్రారంభించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్​లో నలువైపులా షోరూంలను ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ముషీరాబాద్​లోని గోల్కొండ షోరూంను సందర్శించిన కేటీఆర్... అక్కడున్న చేనేత వస్త్రాలు, నిర్మల్ పెయింటింగ్స్ వంటి హస్తకళల ఉత్పత్తులను పరిశీలించారు. ప్రస్తుతం షోరూమ్ నడుస్తున్న తీరు, ఉత్పత్తులకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను అడిగి తెలుసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.