Minister KTR on DK Sivakumar Letter : ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అన్నట్లు ఎన్నికల బరిలో తలపడుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. రాజకీయ వేడిని అమాంతం పెంచేశారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాఫిక్‌గా మారాయి. రాష్ట్రంలో కేసీఆర్ కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లోని పరిశ్రమలు బెంగళూరుకు తరలివెళ్తాయని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(Minister KTR) పేర్కొన్నారు.
కంపెనీలను బెంగళూరుకు తరలించాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Sivakumar Letter) ఇటీవల ఫాక్స్‌కాన్ సంస్థకు లేఖ రాశారని కేటీఆర్ తెలిపారు. త్వరలో తెలంగాణలో తమ ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందని.. తరలింపునకు ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవని ఆ లేఖలో పేర్కొన్నారని ప్రస్తావించారు. కేసీఆర్‌పై దాడికి షర్మిలతో పాటు చాలా మంది ఒకటవుతున్నారని విమర్శించారు. సింహం సింగిల్‌గానే వస్తుందని.. ఈ ఎన్నికలకు కేసీఆర్ సింగిల్‌గానే వెళతారని స్పష్టం చేశారు.
KTR Says Vote for KCR Again : కేసీఆర్ మళ్లీ ప్రజలనే నమ్ముకుంటారని.. ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు మేలు చేసిన కేసీఆర్ బరాబర్ ఓట్లడుగుతున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ఈ మేరకు స్పందించారు. అక్కడక్కడ ఏదైనా అసంతృప్తి ఉన్నా.. ఓట్లు మాత్రం బీఆర్‌ఎస్‌కే వేయాలని కేటీఆర్ కోరారు. న్యాయవాదుల డిమాండ్ల పరిష్కారానికి తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
లేఖ రాసినట్లు వచ్చిన వార్తలను ఖండించిన డీకే శివకుమార్ : కంపెనీల కోసం లేఖ రాసినట్లు చెబుతున్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఖండించారు. ఫాక్స్ కాన్ గ్రూపునకు లేఖ రాసినట్లు వస్తున్న వార్తలను ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన తోసిపుచ్చారు. యాపిల్ కంపెనీ ప్లాంట్‌ను బెంగళూరుకు శివకుమార్ ఆహ్వానించినట్లు లేఖలో పేర్కొన్నారు. తన పేరుతో సోషల్ మీడియాలో తిరుగుతున్న లేఖ నకిలీదని శివకుమార్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ లేఖపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీకే శివకుమార్ వెల్లడించారు.
" class="align-text-top noRightClick twitterSection" data=""యాపిల్ ఎయిర్‌పాడ్ తయారీ ప్లాంట్‌ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్‌కాన్ గ్రూపులకు లేఖ రాశానంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న లేఖ నకిలీది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది." - డీకే శివకుమార్ ట్వీట్
ಆಪಲ್ ಏರ್ ಪಾಡ್ ಉತ್ಪಾದನಾ ಘಟಕವನ್ನು ಹೈದರಾಬಾದ್ನಿಂದ ಬೆಂಗಳೂರಿಗೆ ಸ್ಥಳಾಂತರಗೊಳಿಸುವಂತೆ ಫಾಕ್ಸ್ ಕಾನ್ ಸಂಸ್ಥೆ ನಾನು ಬರೆದಿರುವುದಾಗಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಹರಿದಾಡುತ್ತಿರುವ ಪತ್ರ ನಕಲಿಯಾಗಿದ್ದು, ಈ ಸಂಬಂಧ ಸೈಬರ್ ಕ್ರೈಮ್ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಎಫ್ಐಆರ್ ದಾಖಲಾಗಿದೆ.
— DK Shivakumar (@DKShivakumar) November 4, 2023
The letter circulating on social media, saying… pic.twitter.com/HZTcTM5f96
">ಆಪಲ್ ಏರ್ ಪಾಡ್ ಉತ್ಪಾದನಾ ಘಟಕವನ್ನು ಹೈದರಾಬಾದ್ನಿಂದ ಬೆಂಗಳೂರಿಗೆ ಸ್ಥಳಾಂತರಗೊಳಿಸುವಂತೆ ಫಾಕ್ಸ್ ಕಾನ್ ಸಂಸ್ಥೆ ನಾನು ಬರೆದಿರುವುದಾಗಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಹರಿದಾಡುತ್ತಿರುವ ಪತ್ರ ನಕಲಿಯಾಗಿದ್ದು, ಈ ಸಂಬಂಧ ಸೈಬರ್ ಕ್ರೈಮ್ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಎಫ್ಐಆರ್ ದಾಖಲಾಗಿದೆ.
— DK Shivakumar (@DKShivakumar) November 4, 2023
The letter circulating on social media, saying… pic.twitter.com/HZTcTM5f96
ಆಪಲ್ ಏರ್ ಪಾಡ್ ಉತ್ಪಾದನಾ ಘಟಕವನ್ನು ಹೈದರಾಬಾದ್ನಿಂದ ಬೆಂಗಳೂರಿಗೆ ಸ್ಥಳಾಂತರಗೊಳಿಸುವಂತೆ ಫಾಕ್ಸ್ ಕಾನ್ ಸಂಸ್ಥೆ ನಾನು ಬರೆದಿರುವುದಾಗಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಹರಿದಾಡುತ್ತಿರುವ ಪತ್ರ ನಕಲಿಯಾಗಿದ್ದು, ಈ ಸಂಬಂಧ ಸೈಬರ್ ಕ್ರೈಮ್ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಎಫ್ಐಆರ್ ದಾಖಲಾಗಿದೆ.
— DK Shivakumar (@DKShivakumar) November 4, 2023
The letter circulating on social media, saying… pic.twitter.com/HZTcTM5f96