ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రతినిధుల బృందం ప్యారిస్ పర్యటన(Ktr France tour) కొనసాగుతోంది. రెండో రోజు మంత్రి కేటీఆర్ బృందం ఫ్రెంచ్ వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమైంది. ఫ్రాన్స్‌లో అతిపెద్ద ఎంప్లాయర్ ఫెడరేషన్ అయిన మూవ్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో భేటీ అయింది. తెలంగాణలో పెట్టబడి అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఇటీవల సాధించిన విజయాలను పేర్కొన్నారు. ప్యారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్-ఎఫ్‌లో కేటీఆర్ బృందం పర్యటించింది. టీహబ్, వీ-హబ్, టీ వర్క్స్ వంటి తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ సంస్థలతో సహకారంపై చర్చించింది. స్టేషన్ - ఎఫ్ ప్యారిస్‌లోని ఓ ప్రత్యేకమైన క్యాంపస్, కమ్యూనిటీ, వెయ్యి స్టార్టప్‌ల కేంద్రంగా ఉంది. రైల్వే డిపోగా ఉన్న ఈ కేంద్రాన్ని ఇంక్యుబేటర్‌గా మార్పుచేశారు.
తెలంగాణలో అవకాశాలపై వివరణ
ఏడీపీ ఛైర్మన్, సీఈవో అగస్టిన్ డీ రోమనెట్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఏడీపీ ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడులు పెట్టింది. భారతదేశంలో విమానయాన రంగం వేగవంతమైన వృద్ధి దశలో ఉందని... మహమ్మారి సంబంధిత ఆంక్షలు సడలించడంతో పరిశ్రమ కొత్త ఎత్తులను స్కేల్ చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో విమానయాన రంగంలో ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. ప్రపంచ ఏరోస్పేస్ కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా ఉందన్నారు. ఏరోస్పేస్ రంగానికి నాణ్యమైన సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ మిస్టర్ ఫాబ్రిస్ బస్చిరా, గ్లోబల్ వ్యాక్సిన్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ ఇసాబెల్లె డెస్చాంప్స్‌ను తెలంగాణ ప్రతినిధుల బృందం(Ktr France tour) కలిసింది. సనోఫీ త్వరలో హైదరాబాద్ ఫెసిలిటీ నుంచి సిక్స్ ఇన్‌వన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు పాల్గొన్నారు.
-
Minister @KTRTRS toured Station F, world's largest incubator campus located in Paris.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Minister interacted with the @joinstationf team and discussed about potential collaboration with Telangana's innovation ecosystem organizations like THub, WeHub and TWorks. pic.twitter.com/umAwuDPCxN
">Minister @KTRTRS toured Station F, world's largest incubator campus located in Paris.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 29, 2021
Minister interacted with the @joinstationf team and discussed about potential collaboration with Telangana's innovation ecosystem organizations like THub, WeHub and TWorks. pic.twitter.com/umAwuDPCxNMinister @KTRTRS toured Station F, world's largest incubator campus located in Paris.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 29, 2021
Minister interacted with the @joinstationf team and discussed about potential collaboration with Telangana's innovation ecosystem organizations like THub, WeHub and TWorks. pic.twitter.com/umAwuDPCxN
కాస్మొటిక్ వ్యాలీ సంస్థల ఆసక్తి: కేటీఆర్
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఫ్రాన్స్‌లోని ప్రముఖ సౌందర్య సాధనాల సంస్థలు ఆసక్తి కనబరిచాయి. ప్రసిద్ధి చెందిన కాస్మొటిక్ వ్యాలీ డిప్యూటీ సీఈవో, అంతర్జాతీయ వ్యూహకర్త ఫ్రాంకీ బెచెరో నేతృత్వంలో పలు సంస్థల అధిపతులు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను(Ktr France tour) కలిసి ఈ విషయమై చర్చించారు. ‘‘పారిస్‌లోని కాస్మొటిక్ వ్యాలీలో 800 కంపెనీలున్నాయి. ఏటా రూ.82 వేల కోట్ల మేరకు ఆదాయం ఆర్జిస్తున్నాయి. ఆయా సంస్థల్లో 70,000 మంది పనిచేస్తున్నారు. 7 విశ్వవిద్యాలయాలు, 136 కళాశాలలు, 200 పరిశోధన ప్రయోగశాలలు అనుబంధంగా ఉన్నాయి. 100 పరిశోధన ప్రాజెక్టులు నడుస్తుండగా.. 8,600 పరిశోధకులు నిత్యం ప్రయోగాలు చేస్తున్నారు’’ అని ఫ్రాంకీ, పారిశ్రామికవేత్తలు తెలిపారు. భారత్‌లో సౌందర్య సాధనాలకు భారీగా డిమాండ్ ఉందని, మార్కెటింగ్‌లో ఏటా భారీ వృద్ధి రేటు సాధిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. కరోనా సమయంలోనూ సౌందర్య సాధనాల విక్రయాలు తగ్గలేదన్నారు. తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు ద్వారా దేశమంతటా మార్కెటింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. త్వరలో తెలంగాణను సందర్శించాలని మంత్రి కోరగా పారిశ్రామికవేత్తలు సుముఖత వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఫ్రాంకీని కేటీఆర్ పోచంపల్లి శాలువతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.
ఇదీ చదవండి: Ktr France tour: రాష్ట్రంలో పెట్టుబడులకు కాస్మొటిక్ వ్యాలీ సంస్థల ఆసక్తి: కేటీఆర్