ETV Bharat / state

Minister KTR Meet Ponnala Lakshmaiah : బీఆర్​ఎస్​లో చేరేందుకు పొన్నాల సుముఖత.. సముచిత స్థానం కల్పిస్తాం : కేటీఆర్ - పొన్నాలతో కేటీఆర్ సమావేశం

Minister KTR Meet Ponnala Lakshmaiah : కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో బీఆర్‌ఎస్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్‌.. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు వెళ్లారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ సూచన మేరకు పొన్నాలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.

Minister KTR
Minister KTR Meet Ponnala Lakshmaiah
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2023, 2:25 PM IST

Updated : Oct 14, 2023, 4:59 PM IST

inister KTR Meet Ponnala Lakshmaiah : కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో బీఆర్‌ఎస్‌ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్‌.. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు వెళ్లారు. పొన్నాలతో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్‌ఎస్‌లోకి (Ponnala to be Join in BRS) ఆహ్వానించడానికి వచ్చానని తెలిపారు. పార్టీలో చేరడానికి పొన్నాల సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు.

Ponnala Lakshmaiah Resigns to Congress : కాంగ్రెస్​కు రాజీనామా చేసిన పొన్నాల.. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన

పొన్నాలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన రేపు సీఎం కేసీఆర్‌ను కలిసి... తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాంగ్రెస్‌కు పొన్నాల ఎంతో సేవ చేశారన్న కేటీఆర్​.. ఇంతటి సీనియర్లకు కనీసం అపాయింట్‌మెంట్‌, గౌరవం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బలహీన వర్గాల నేత పొన్నాలను రేవంత్‌రెడ్డి తూలనాడిన విధానం దిగజారుడు సంస్కారానికి నిదర్శనం అని విమర్శించారు. పొన్నాలను కాంగ్రెస్ నిరాదరించినా.. తాము వారిని ఆహ్వానిస్తామన్నారు. కనకపు సింహాసనంపై ఓటుకు నోటు కేసు దొంగను కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. ఆహ్వానాన్ని మన్నించి పొన్నాల తమ పార్టీలో చేరతారనే విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పొన్నాల.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తర్వాత అన్ని విషయాలు వివరిస్తారని తెలిపారు.

"బలహీన వర్గాల్లో బలమైన గొంతు కలిగిన పొన్నాల లక్ష్మయ్యను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించడానికి మా పార్టీ అధ్యక్షుల సూచన మేరకు వచ్చాం. వారు పార్టీలోకి రావాలని.. వారికి సముచిత స్థానాన్ని.. ప్రాధాన్యతను బీఆర్‌ఎస్ కల్పిస్తుందని వారిని రేపు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసి 16వ తేదీన జనగామ క్షేత్రంలో జరిగే బహిరంగ సభలో పార్టీలో చేరమని అడిగాం. వారు సుముఖత వ్యక్తం చేశారు." - కేటీఆర్, మంత్రి

Minister KTR Meet Ponnala Lakshmaiah బీఆర్​ఎస్​లో చేరేందుకు పొన్నాల సుముఖత సముచిత స్థానం కల్పిస్తాం కేటీఆర్

Congress Candidate List 2023 : రేపే కాంగ్రెస్​ పార్టీ 70 మంది అభ్యర్థుల తొలి జాబితా?.. 18 నుంచి బస్సు యాత్ర

Ponnala Lakshmaiah Fires on Revanth Reddy : మంత్రి కేటీఆర్‌ వచ్చి తనను బీఆర్​ఎస్​లోకి ఆహ్వానించారని పొన్నాల పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు రావాలని కోరారని తెలిపారు. రేపు సీఎంను కలిసిన తర్వాత వివరాలు తెలియజేస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్​ పార్టీకి, ప్రాంతానికి తాను చేసిన సేవలను కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఐకమత్యమే పార్టీ బలమన్న ఆయన.. ఈ విషయం రేవంత్ మర్చిపోయారని దుయ్యబట్టారు.

కేటీఆర్‌ వచ్చి బీఆర్​ఎస్​లోకి నన్ను ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు రావాలని కేటీఆర్‌ కోరారు. రేపు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత వివరాలు తెలియజేస్తా. పార్టీకి, ప్రాంతానికి నేను చేసిన సేవలు కనుమరుగు చేశారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను భ్రష్టుపట్టిస్తున్నారు. ఐకమత్యమే పార్టీ బలం.. ఈ విషయం రేవంత్ మర్చిపోయారు. - పొన్నాల

Revanth Reddy Fires on CM KCR : 'బీఆర్ఎస్ మరో 45 రోజులే.. ఆ తర్వాత మేమే అధికారంలోకి వస్తాం'

Bhatti Vikramarka on Congress Manifesto 2023 : 'ప్రజల అజెండానే కాంగ్రెస్ మేనిఫెస్టో.. తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పాటు ఖాయం'

Last Updated : Oct 14, 2023, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.