ETV Bharat / state

KTR on hyd roads: హైదరాబాద్​ రోడ్ల అభివృద్ధికి రూ.5,900 కోట్ల రుణం: కేటీఆర్

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో(Assembly monsoon session) ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో(KTR on hyd roads) రోడ్లు, పై వంతెనలు నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్(minister ktr)​ సమాధానమిచ్చారు. నగరంలో రహదారుల నిర్మాణానికి రూ. 5 వేల 900 కోట్లు రుణం తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు. కొత్త రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి జరుగుతుందని, ఆర్థిక కార్యకలాపాలు మొదలువుతాయని వివరించారు.

ktr
కేటీఆర్
author img

By

Published : Sep 27, 2021, 11:15 AM IST

Updated : Sep 27, 2021, 11:47 AM IST

మౌలిక వసతుల కల్పన కోసం(KTR on hyd roads), ఉత్పాదక రంగంలో వెచ్చించే ప్రతి రూపాయి భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే భావించాలని... దానిని రుణంగా చూడవద్దని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్(minister ktr) తెలిపారు. హైదరాబాద్(hyderabad)​ మహానగరంలో ప్రజారవాణాను ప్రోత్సహిస్తూనే ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అందుకోసం వేల కోట్ల రూపాయల వ్యయంతో పై వంతెనలు(fly overs), అండర్​ పాస్(underpass)​లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు నగరంలో రూ. 2వేల కోట్లతో 22 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్​లు పూర్తి చేసినట్లు చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి(Assembly monsoon session) సమాధానమిచ్చారు.

రూ. 1545 కోట్ల వ్యయంతో చార్మినార్, సౌత్​ జోన్ల పరిధిల్లో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. నగర వ్యాప్తంగా రోడ్లను కలిపేందుకు 132 లింక్ రోడ్లు పనులు చేపట్టినట్లు అందులో 24 పూర్తయినట్లు వివరించారు. పాత బస్తీలో త్వరలోనే పై వంతెన పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

హైదరాబాద్​ రోడ్ల అభివృద్ధికి రూ.5,900 కోట్ల రుణం: కేటీఆర్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ తగ్గించే ఉద్దేశంతో రోడ్లు నిర్మిస్తున్నాం. ఉత్పాదక రంగంలో వెచ్చించే ప్రతి రూపాయి భవిష్యత్తు పెట్టుబడిగానే చూడాలి. రూ. 2 వేల కోట్లతో 22 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాం. నగరంలో 24 లింక్‌ రోడ్లు ప్రారంభించాం. హైదరాబాద్​ రోడ్ల అభివృద్ధికి రూ.5,900 కోట్ల రుణం తీసుకున్నాం. కొత్త రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయి. -కేటీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

రహదారుల(KTR on hyd roads) నిర్మాణానికి 5 వేల 900 కోట్లు రుణం తీసుకున్నామన్న కేటీఆర్.... వాటిని భవిష్యత్తు పెట్టుబడులుగానే చూడాలని సూచించారు. కొత్త రోడ్ల నిర్మాణంతో(KTR on hyd roads) అభివృద్ధి జరుగుతుందని, ఆర్థిక కార్యకలాపాలు మొదలువుతాయని అభిప్రాయపడ్డారు. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వివరించారు. ఎస్సార్​డీపీ రెండో దశ ప్రణాళికలు పూర్తయ్యాయని తెలిపారు.

ఇదీ చదవండి: CYCLONE GULAB UPDATES : తెలంగాణలో ఏకధాటి వర్షాలు.. నెమ్మదిగా స్తంభిస్తోన్న జనజీవనం

Last Updated : Sep 27, 2021, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.