ETV Bharat / state

Jagadish: 'ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ ఈటల తెరాసలో ఉండాల్సింది' - telangana varthalu

ఇన్ని రోజులు భాజపాను విమర్శించిన ఈటల.. మళ్లీ అదే పార్టీలో చేరడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ ఈటల తెరాసలో ఉండాల్సిందని మంత్రి జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు.

Jagadeesh reddy
'ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ ఈటల తెరాసలో ఉండాల్సింది'
author img

By

Published : Jun 14, 2021, 5:26 PM IST

'ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ ఈటల తెరాసలో ఉండాల్సింది'

నిన్నటి వరకు భాజపాను విమర్శించి... ఈటల రాజేందర్‌ అదే పార్టీలో చేరడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెరాసను వీడితే వారికే నష్టం తప్ప తమ పార్టీకేమీ కాదని స్పష్టం చేశారు. గుంపును వదిలి అడవిలోకి పోతే... మృగాల పాలవుతారన్నారు.

ఈటల రాజేందర్‌కు తెరాసలో సముచిత స్థానం కల్పించామని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇన్నిరోజులు భాజపా హిట్లర్​ పార్టీ అంటూ విమర్శించి.. అదే పార్టీలో చేరడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఈటల చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదని మంత్రి ఆరోపించారు. ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ ఈటల తెరాసలో ఉండాల్సిందని జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Etela: హుజూరాబాద్​లో వంద శాతం పోటీ చేస్తా.. గెలుస్తా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.